Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeకవితదాటుకోవడం అలవాటు చేసుకో

దాటుకోవడం అలవాటు చేసుకో

- Advertisement -

ఎప్పుడో ఒకసారి దాటుకోవాల్సిందే
గతం నుండి వర్తమానంలోకి, వర్తమానం నుండి భవిష్యత్తులోకి
బాధగానో, జ్ఞాపకంగానో, చిల్లులుపడిన దేహంతోనో,
ఎవరో పుకిలించి వేసిన నీటిగానో,
అకారణంగా నిందింపబడిన మనసుతోనో,
గర్భం నుండి విసిరేయబడిన రక్తపు ముద్దగానో,
అన్నీ ఉన్నా ఏది లేనివాడిలా దాటుకోవడం ఒక అనివార్య చర్య.
ఎప్పుడో పాచిపోయిన మూటలను విప్పుకోవడం,
మనసుల్లో కంపుగొట్టే భావాలను బహిరంగపరుచుకోవడం,
కొత్త ఆకులు చిగురించే చోట
పండుటాకుల గాయాలపై గొడ్డుకారం చల్లుకోవడం,
చల్లని సాయంత్రానికి వికతమైన రూపాన్ని దిద్దుకోవడం,
వెలుగు కోసమో, వెలుగులాంటి మాట దొరకని చోట ఉండటం కంటే
దాటుకోవడం ఉన్నతమైనదే.
ఎప్పుడో తెలిసిన వాస్తవాల మూలాలు వెతుక్కోవడం
చుక్కలు రాలుతున్నప్పుడు
కంట్లో బురదనో, బురదలాంటి నిజాలనో,
ఎవరి అభద్రతలను వారు కక్కుకోవడం కంటే
అడుగులు కొత్త దారులను అన్వేషించుకోవడమే మంచిది.
ఎవరి శవ యాత్రకు వారే తెల్లని గుడ్డను సిద్ధపరచుకోవాలి
ఎవరి జాగాలను వారే తవ్వుకొని శాశ్వత గహాన్ని నిర్మించుకోవాలి.
బంధాలన్నీ తోకచుక్కల్లా జారిపోయిన చోట
ఎవరి నావను వారే నడుపుకుంటూ ఈ వైపు నుండి ఆ వైపుకు
బ్రతికున్న శవంలా తరలిపోవాలి.
ఎవరూ దేనికీ అతీతులు కాదు, కాలానికి లొంగని అక్షరం ఉన్నదా!?
– జాని తక్కెడశిల, 7259511956

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img