Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడిప్రెషన్‌ నుంచి బయట పడేస్తుంది

డిప్రెషన్‌ నుంచి బయట పడేస్తుంది

- Advertisement -

సాయి చరణ్‌, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్‌ ఓకే గురు’. మణికంఠ దర్శకుడు. క్రాంతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 12న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీ- రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘టైటిల్‌ చాలా బాగుంది. అందరికీ రీచ్‌ అయింది. కంటెంట్‌ చూస్తుంటే లవ్‌ స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్‌, మ్యూజిక్‌ అన్ని బాగున్నాయి. లవ్‌ స్టోరీకి మ్యూజిక్‌ విజువల్స్‌ బాగుంటే 60% సినిమా హిట్‌ అయినట్టే’ అని తెలిపారు. ‘ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్ట్‌ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఒక సాంగ్‌ నాకు చాలా నచ్చింది. మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్‌ ఫిలిం నాకు చాలా ఇష్టం. ఇది తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌ చెప్పారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మోహిత్‌ మాట్లాడుతూ,’ఇది నా ఐదో సినిమా. ఇందులో అన్ని పాటలు చేశాను. ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది’ అని తెలిపారు. ‘ట్రైలర్‌ మీ అందరికి నచ్చినందుకు ఆనందంగా ఉంది. ‘ఇట్స్‌ ఓకే గురు’ అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్‌ ఓకే అని ముందుకెళ్ళిపోతే లైఫ్‌ చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో ఉంది’ అని డైరెక్టర్‌ మణికంఠ అన్నారు. ప్రొడ్యూసర్‌ క్రాంతి ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘మన దైనందిన జీవితంలో చిన్న విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటాం. చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్‌ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్‌ని ఎలా అధిగమించాలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే దాన్నుంచి బయటకు వచ్చేస్తారు. మంచి లవ్‌ స్టోరీ పాటు అన్ని ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -