- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆనంతపురం జిల్లా తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
- Advertisement -



