ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమే
వరదల్లో కాంగ్రెస్ బురదరాజకీయం
8 బీ,8 సీ ప్రకారం మాకు నోటీసు ఇవ్వలేదు
చట్టబద్ధంగా విచారణ జరగనందునే హైకోర్టుకెళ్లాం
స్టే రావొద్దనే ప్రభుత్వం సుప్రీంలో కేవియట్ దాఖలు
తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేనందునే కాళేశ్వరం నిర్మాణం
ఆర్థిక అవకతవకలు ఒట్టిమాటే : అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక డొల్ల అనీ, ఒక చిత్తు కాగితమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్‌రావు విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ నివేదిను రూపొందించారని అన్నారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అనేక బాధలు పడుతున్నారని అన్నారు. ఈ సమయం లో కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయం చేస్తున్నదని వివరిం చారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయి రీస్ యాక్టు-1952 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా నిబంధనలు పాటించకుండా ఈ నివేదికను ఘోష్ కమి షన్ రూపొందించిందని విమర్శించారు. చట్టబద్ధంగా విచారణ జరగనందునే హై కోర్టును ఆశ్రయించామని వివ రించారు. మాజీ సీఎం కేసీఆర్, తనతోపాటు అధికారులకు 8 బీ ప్రకారం నోటీసు ఇవ్వకుండా కమిషన్లు ఇచ్చే నివేదికలు చిత్తు కాగితంతో సమానమని వ్యాఖ్యానించారు. గతంలో కోర్టులిచ్చిన తీర్పు లను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎమర్జెన్సీ విధించినందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై వేసిన షా కమిషన్‌పై ఆమె, లిబర్ హాన్ కమిషన్‌పై బీజేపీ నేత ఎల్‌కె అద్వానీ కోర్టుకు వెళ్లారని వివరించారు. వారు కోర్టుకెళ్తే ఒప్పు, తాము న్యాయస్థానానికి వెళ్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 660 పేజీల ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ఆపాలంటూ తాను కోర్టును ఆశ్రయించలేదని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్వకేట్ జనరల్ ద్వారా పిటిషన్‌ను తెప్పించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం విచారణ జరగననందున ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కోర్టును కోరామన్నారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ నివేదిక క్వాష్ అవుతుందనే ఆందోళనతోనే సీఎం రేవంత్‌రెడ్డి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. అందుకే ఆదరాబాదరగా ఆదివారం అసెంబ్లీలో చర్చకు పెట్టారని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ తమ హక్కులను కాలరాసిందన్నారు. విచారణను ఎదుర్కొనే పౌరులు, నాయకులు, అధికారులకు హక్కులుంటా యని వివరించారు. నిష్పాక్షికంగా విచారణ జరగలేదన్నారు.
రూ.లక్ష కోట్ల కమీషన్ల కోసమే కాళేశ్వరం : కోమటిరెడ్డి
కోర్టు కేసులు, సాంకేతిక అంశాలపై ఇప్పుడు మాట్లాడొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్ల కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. పొరపాటున బీఆర్‌ఎస్ గెలిచి ఉంటే పోలవరం వరు మరో మూడు లిఫ్టులు పెట్టి మరో రూ.లక్ష కోట్లు దోపిడీ చేసేదని అన్నారు. మేడిగడ్డ కుంగిందా? లేదా?, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా?లేదా? అనేది చెప్పాలన్నారు. ఇప్పటికే ప్రజలు శిక్షించారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చెప్పారు. తప్పయ్యిందంటూ ఒప్పుకోవాలని కోరారు. నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుంందన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఆ వీడి యో చూపించమంటారా?అని స్పీకర్‌ను అడిగారు. కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ సోనియాను దేవత అన్నారు. కేసీ ఆర్ కుటుంబంతో వెళ్లి కలిశారని చెప్పారు. కేసీఆర్‌కు బాధ్యత ఉంటే సభకు రావాలని డిమాండ్ చేశారు. ఫాంహౌజ్‌లో ఉంటూ ప్రజలను అవమానపరుస్తున్నారని అన్నారు.
జూపల్లి అప్పుడెందుకు అడగలేదు? : హరీశ్‌రావు
తుమ్మడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించడానికి ప్రత్యేకంగా నీటి లభ్యత ఎక్కడిదని హరీశ్‌రావును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద కలిసే ఆ ఉపనది ఏంటో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినపుడు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. అప్పుడెం దుకు అడగలేదని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని నాడు బీఆర్‌ఎస్‌లో మాట్లాడే ప్రజాస్వామిక వాతావరణం లేదన్నారు.
ప్రాణహిత చేవెళ్లకు రూ.6,100 కోట్లు ఖర్చెందుకు చేశారు? : పొంగులేటి
ఉమ్మడి ఏపీలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.6,600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆ తర్వాత మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించారని వివరించారు. ప్రాజెక్టును మార్చాలనే ఉద్దేశం ముందే ఉన్నపుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.6,600 కోట్లు ఎందుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. స్వార్ధం, స్వలాభం కోసమే అలా చేశారని ఆరో పించారు. రూ.లక్ష కోట్లు కొల్లగొట్టేందుకే కాళేశ్వరం నిర్మించారని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టాలనే భావించామని హరీశ్‌రావు చెప్పారు. ఎనిమిది నెలలు ఆగిన తర్వాత నీళ్లు అందుబాటులో లేవనీ, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదనీ, సీడబ్ల్యూసీ వద్దని చెప్పిందన్నారు. అందుకే మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టాల్సి వచ్చిందని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తట్టెడు మట్టి ఎందుకు తవ్వ లేదని ప్రశ్నించారు. శ్రీధర్‌బాబు స్పందిస్తూ తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల వద్ద ప్రాజెక్టును కట్టితీరుతామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కాళేశ్వరం కథ తేలిన తర్వాతే ముందుకెళ్లాలని భావించామని అన్నారు.
డ్రామా కంపెనీ నడుపుతున్న ప్రభుత్వం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్ల మెంటు ఎన్నికలప్పుడు మధ్యంతర నివేదిక, బీఆర్‌ఎస్ రజతో త్సవ సభ సమయంలో తుది నివేదిక, స్థానిక సంస్థల ఎన్నిక లకు ముందు ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం విడుదల చేసిందని హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వం నడుపుతున్నారా? డ్రామా కంపెనీ నడుపుతున్నారా?అని వ్యాఖ్యానించారు. ఈ నివేదిక చెల్లదనీ, న్యాయబద్ధం కాదని చెప్పారు.
ఘోష్ కమిషన్ నివేదిక చిత్తుకాగితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES