- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాయమాటలు చెప్పి ఓ మహిళ 13 ఏళ్ల ప్రణీతను కిడ్నాప్ చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటు చేసుకుంది. ఎడపల్లి గురుకుల పాఠశాలలో ఆమె 8వ తరగతి చదువుతోంది. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వందలాది కెమెరాల సాయంతో జల్లెడ పడుతున్నారు. బాలికను ఓ మహిళ తీసుకెళ్లి బాన్సువాడ బస్సు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
- Advertisement -