ఏకాదశి హోమం, గీతా పారాయణం
నవతెలంగాణ – కట్టంగూర్
మానవాళికి జీవన విధానాన్ని ప్రబోధించే శ్రీమద్ భగవద్గీత జయంతి పర్వదినమైన మోక్షద ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో సోమవారం గీతా జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొలుత ఏకాదశి పర్వదినం సందర్భంగా తృతీయ వార్షిక పంచమ మహా యజ్ఞాన్ని ఆలయ పూజారి రాముడుగు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం గీతా జయంతిని పురస్కరించుకుని భగవాన్ శ్రీకృష్ణుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులు సామూహిక గీతా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ భగవాన్ శ్రీకృష్ణుడు సర్వమానవాళి ఉద్దేశించి ప్రబోధించిన సందేశాత్మక గ్రంథం అన్నారు. ఈ కార్యక్రమాల్లో రామడుగు శశిరేఖ, కొంపెల్లి లక్ష్మయ్య మంగమ్మ, ఓరుగంటి రమేష్ ఉష దంపతులు, గుడిపాటి పద్మ, కడవేరు కృష్ణవేణి, గుండు రూప, కొత్త శోభ, ఇల్లందుల సంధ్యమ్మ, మూడుదుడ్ల ఆండాలు, చేగోని లక్ష్మి, నల్ల ధనమ్మ, కోమటి భాస్కర్, రెడ్డిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గీతా జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


