- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
సర్పంచిగా ఒక్క సారీ అవకాశం ఇస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, సమస్యలు లేని గ్రామంగాతీర్చి దిద్దుతానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రమావత్ శ్రీకర్ అన్నారు. మండలంలోని నీమా నాయక్ తండా సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బుధవారం వారం గ్రామంలో ప్రచారం నిర్వహించచి మాట్లాడారు. గ్రామంలో అన్ని వసతులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను పుట్టిన ఊరు కోసం సేవ చేయడానికి సర్పంచిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు అందరూ తనను మెజార్టీతో గెలిపించాలన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానన్నారు. బ్యాట్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు.
- Advertisement -



