Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పోడు రైతులకు పట్టాలు ఇవ్వండి

పోడు రైతులకు పట్టాలు ఇవ్వండి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
పేద మధ్య తరగతి రైతులకు పట్టాలు ఇవ్వాలని పోడు భూములకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందించి సాగు చేసుకునే విధంగా సౌకర్యాన్ని కల్పించాలని అఖిల భారత రైతుకూలిసంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 27-5- 2025 న మాచారెడ్డి ఎమ్మార్వోకు ఏ.ఐ.కే.ఎం.ఎస్ ఆధ్వర్యంలో మెమోరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పేద, మధ్య తరగతి రైతులకు పోడు పట్టాలు అందచేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఇంకా రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. తక్షణమే నిరుపేద రైతులందరికీ పోడు పట్టాలు ఇచ్చి వారికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పించలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ నాయకులు ఎండి అలీ, పి.క్రిష్టయ్య, భుక్య హీరమన్, సుజాత, లక్ష్మి, షేక్ ఖాసిం, భూక్య తిర్మల్, రాములు, షేక్ నవాబ్, ఎస్ కె గొరెమియా తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad