Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుఅవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా...

అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…

- Advertisement -

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి

  • సర్పంచ్ అభ్యర్థి తొంట కిష్టయ్య పిలుపు

నవతెలంగాణ – సదాశివపేట

సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొంట కిష్టయ్య ఆదివారం నాడు గ్రామంలోని వీధులన్నింటిలోనూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను అభివాదించారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా తొంట కిష్టయ్య మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా నేను గ్రామంలో రేషన్ డీలర్‌గా ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్నాను. గతంలో నా భార్య తొంట యాదమ్మ కిష్టయ్య ఎంపీటీసీగా ప్రజల ఆదరణతో మంచి సేవలు చేశారు. మా కుటుంబం ఎప్పుడూ ప్రజల మంచికే పని చేస్తోంది అని తెలిపారు.

తాను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదని, తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయం చేసానని అన్నారు. బాధపెట్టడం నా స్వభావం కాదు. గ్రామాభివృద్ధే నా లక్ష్యం. లక్ష్మారెడ్డి ముఖ్య అనుచరుడిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. వెల్టూరులోని ప్రతి ఓటరు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. వెల్టూరు అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తాను కష్టపడి పనిచేస్తానని తొంట కిష్టయ్య హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -