Sunday, December 7, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్పంచిగా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధికి కృషి చేస్తా

సర్పంచిగా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధికి కృషి చేస్తా

- Advertisement -

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దామెర బుచ్చి రాములు

నవతెలంగాణ- చండూరు
మండలంలోని గ్రామ అభివృద్దే తన లక్ష్యమని, ఒకసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే అభివృద్ధి పనులుచేసి చూపిస్తానని శిర్దపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దామెర బుచ్చి రాములు అన్నారు. ఆదివారం ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ.. ఈనెల 11న నిర్వహించినున్న సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రభుత్వం నిధులను పారదర్శకంగా వినియోగించి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా పనిచేస్తానన్నారు.
అభివృద్ధి కోసం మీరు వేసే ఓటు భవిష్యత్తును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతుందన్నారు. సేవలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని, ఈ మద్దతు గెలుపు వచ్చేవరకు ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పోల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మా రెడ్డి శ్రీదేవి నర్సిరెడ్డి, గంట మల్లయ్య,గణపతి, అంజిరెడ్డి అంజిరెడ్డి, కర్నాటి మహేష్, భారత రాజు గిరి, మల్లేష్, సైదులు, నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -