– విద్యాశాఖ సంచాలకులకు టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నందున వారికి స్నాక్స్ అందించాలని టీఎస్‌జీహెచ్‌ఎంఏ కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోలస్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ గిరిధర్‌గౌడ్, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం అందజేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో ఉదయం 8.15 గంటలకు వచ్చి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటున్నారని వివరించారు. విద్యార్థులు ఆకలిని తట్టుకుని చదువుపై ఏకాగ్రతలను కొనసాగించాలంటే స్నాక్స్ అందించాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకోసం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ సంచాలకులు సానుకూలంగా స్పందించారనీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ ఇచ్చారని తెలిపారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులుగా అదనపు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారికి ఎఫ్‌ఏసీకి సంబంధించిన అలవెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు.
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES