Friday, September 19, 2025
E-PAPER
Homeసినిమానాని వాయిస్‌ ఓవర్‌తో 'మోగ్లీ 2025' గ్లింప్స్‌

నాని వాయిస్‌ ఓవర్‌తో ‘మోగ్లీ 2025’ గ్లింప్స్‌

- Advertisement -

‘బబుల్‌గమ్‌’ మూవీతో ప్రేక్షకులకు హీరోగా రోషన్‌ కనకాల పరిచయం అయ్యారు. తాజాగా ఆయన ‘మోగ్లీ 2025’లో భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్‌, కతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్ర పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్‌ గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.
తాజాగా అగ్ర హీరో రామ్‌ చరణ్‌ ‘ది వరల్డ్‌ ఆఫ్‌ మోగ్లీ ‘ గ్లింప్స్‌ను లాంచ్‌ చేశారు. ఈ గ్లింప్స్‌కి మరో అగ్రహీరో నాని వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.
గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో రోషన్‌ కనకాల మాట్లాడుతూ,’మా గ్లింప్స్‌ లాంచ్‌ చేసిన రామ్‌ చరణ్‌కి ధన్యవాదాలు. ఆయన మా అందరికీ స్ఫూర్తి. ఆయన మా గ్లింప్స్‌ లాంచ్‌ చేయడం హానర్‌గా భావిస్తున్నాం. నేచురల్‌ స్టార్‌ నాని తన వాయిస్‌ ఓవర్‌తో మా కంటెంట్‌ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ఆయనకి హదయపూర్వక కతజ్ఞతలు. విశ్వ ప్రసాద్‌ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాని కూడా ఎంతో ప్యాషన్‌తో చేస్తున్నారు. సందీప్‌ ఈ సినిమాతో ఒక మ్యాడ్‌ నెస్‌ క్రియేట్‌ చేశారు’ అని తెలిపారు.
‘గ్లింప్స్‌ లాంచ్‌ చేసిన రామ్‌ చరణ్‌, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన నానికి థ్యాంక్స్‌. అలాగే కేఎల్‌ యూనివర్సిటీకి థ్యాంక్యూ’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -