Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ రంగానికి దిక్సూచిగా గ్లోబల్‌ సమ్మిట్‌

వ్యవసాయ రంగానికి దిక్సూచిగా గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

డిజిటల్‌ స్మార్ట్‌ దిశగా విప్లవాత్మక మార్పులు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వ్యవసాయ రంగానికి దిక్సూచిగా గ్లోబల్‌ సమ్మిట్‌ దోహదపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతు కుటుంబాలకు అండగా ఉంటామనీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని భరోసానిచ్చారు. వ్యవసాయ రంగంలో డిజిటల్‌ స్మార్ట్‌ దిశగా విప్లవాత్మక మార్పులు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సోమవారం ఫ్యూచర్‌సిటీలో ప్రారంభమైన గ్లోబల్‌ సమ్మిట్‌లో గ్రామీణ వ్యవసాయరంగ వృద్ధి, రైతుల ఆదాయ పెంపు అనే అంశంపై మంత్రి తుమ్మల మాట్లాడారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయం, అనుబంధ రంగాల ఆర్థిక వ్యవస్థ పరిణామం 34.6 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉందనీ, 2047 నాటికి దాన్ని 400 బిలియన్‌ డాలర్లకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటిం చారు. నీటిపారుదల రంగం విస్తరణ, వైవిధ్యమైన పంటల సాగు, డ్రోన్లు, యాంత్రీకరణ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం, మార్కెట్‌ లింకేజీలు, ఈ-ట్రేడింగ్‌ను బలోపేతం చేయడం, ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమల విస్తరణ, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల వ్యవస్థలను బలోపేతం చేయడం, వ్యవసాయ స్టార్టప్‌లను బలోపేతం చేయడం, సేంద్రియ పద్ధతుల్లో సాగును ప్రోత్సహించడం వంటి అంశాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించారు. పొలం నుండి మార్కెట్‌ వరకు బలమైన వ్యవస్థలను నిర్మిస్తామన్నారు. ఈ సదస్సుకు ప్యానెలిస్టులుగా డాక్టర్‌ ఏ.కే.సింగ్‌( హార్టికల్చర్‌ మాజీ డీడీజీ), ఆసియా అభివృద్ధి బ్యాంకు సలహాదారు డాక్టర్‌ అంచ శ్రీనివాసన్‌, ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత డాక్టర్‌ మోదడుగు విజరుగుప్తా, కోసాంబ్‌ ఎమ్‌డీ డాక్టర్‌ జే.ఎస్‌.యాదవ్‌, ఆదిత్య బిర్లా గ్లోబల్‌ ట్రేడింగ్‌ ఎమ్‌డీ, సీఈఓ రాజేశ్‌ సోమాని, ఐఆర్‌ఆర్‌ఐ మాజీ హెడ్‌ డాక్టర్‌ సమరేందు మొహంతిలతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -