Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రపంచానికి రోల్‌మోడల్‌గా గ్లోబల్‌ సమ్మిట్‌

ప్రపంచానికి రోల్‌మోడల్‌గా గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రపంచంలో రోల్‌మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామని చెప్పారు. గడిచిన రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు 2037 విజన్‌, 2047 విజన్‌ ఈ రెండు విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ప్రకటిస్తామని వివరించారు.

గడువులోగా పూర్తిస్థాయి ఏర్పాట్లకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణను దేశంలోనూ, ప్రపంచస్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌తో ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు. 2035 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూపబోదని అన్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -