Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారాక్వాట్ బదులుగా గ్లూఫోసినేట్ అమ్మోనియం

పారాక్వాట్ బదులుగా గ్లూఫోసినేట్ అమ్మోనియం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
రైతులు పారాక్వాట్ బదులుగా గ్లూఫోసి నేట్ అమ్మోనియం వినియోగించాలని వ్యవ సాయ విస్తరణ అధికారి నాగార్జున సూచిం చారు. సోమవారం మండలంలోని ఎల్లా రెడ్డిపేట గ్రామం వరి పంట పొలాలను పర్సిలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రైతులు గట్లపై గడ్డిని తొలగించడానికి పారాక్వాట్ కలుపు మందు వినియోగిస్తు న్నారని అన్నారు. పారాక్వాట్ అన్ని మందు లతో పోలిస్తే చాలా విషపూరితమైనదని పర్యావరణానికి, మనుషులకు హాని కలిగె అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు. రైతులు పారాక్వాట్ బదులుగా గ్లూఫోసి నేట్ అమ్మోనియం వినియోగించాలని సూచించారు.

గ్లూఫోసినేట్-అమ్మోనియం పారాక్వాట్‌తో పోలిస్తే తక్కువ విషపూరిత మైనదని చెప్పారు. పారాక్వాట్ డైక్లోరైడ్ లాగానే గ్లూఫోసినేట్ అమ్మోనియం కూడా నాన్-సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్ అంటే ఏదో ఒక రకం కలుపు మొక్కనో, ఏవో కొన్ని రకాల కలుపు మొక్కల్నో నిర్మూలించడానికి కాదన్నారు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది,  దెబ్బతీస్తుందని వివరించారు. వేగంగా పనిచేసే రసాయనం పొలం గట్లు, తోటలలో మొలిచే గడ్డి, వెడల్పాటి ఆకు కలుపును ఇది సమర్థవంతంగా నివారిస్తుందని అన్నా రు. ఇది పిచికారీ చేసిన 2-3 రోజుల్లోనే కలు పు మొక్కలను ఎండిపోయేలా చేస్తుందని తెలిపారు. 

– పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రైతులు ఆయిల్ పామ్ తోటలో కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మందు పంట పై పడకుండా చూసుకోవాలి. దీని కోసం ‘స్ప్రే హుడ్’ ఉపయోగించడం మంచి ది అన్నారు. కలుపు మొక్కలు 3 అంగుళా ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పిచి కారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నా రు. మొక్కలు కాస్త తడిగా ఉన్నప్పుడు, తేమ ఉన్నప్పుడు పిచికారీ చేస్తే మందు బాగా పనిచేస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -