Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి 

ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి 

- Advertisement -

విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచన
నవతెలంగాణ – వనపర్తి  

విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా కొత్తకోట మండల కేంద్రంలోని కొత్తకోట ప్యూపిల్స్ పాఠశాలలో కిడ్స్ ఉత్సవ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో ఆ పాఠశాలలో చదివి మెడికల్ సీట్లు సాధించిన పలువురు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ ఆహ్వానం మేరకు బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలకు విచ్చేసిన కలెక్టర్కు పాఠశాల యాజమాన్యం జ్ఞాపికను అందజేశారు. పాఠశాల చైర్మన్ రాజవర్ధన్ రెడ్డి, డీఈవో అబ్దుల్ ఘని, ఎంపీడీవో వినీత్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -