- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గోవాలోని అర్పోరాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించారు.
- Advertisement -



