బగా నైట్ క్లబ్‌లో అగ్ని ప్రమాదం
25 మంది మృతి..ఆరుగురికి గాయాలు
మేనేజర్‌తో పాటు పలువురి అరెస్ట్
యజమానులపై అరెస్ట్ వారెంట్ జారీ
సిలిండర్ పేలుడు వల్లేనని అనుమానం
ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన?
రాష్ట్రపతి, ప్రధాని సానుభూతి
మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహరం ప్రకటించిన కేంద్రం
భద్రతా లోపం..ప్రభుత్వ వైఫల్యం : రాహుల్ గాంధీ
గోవా : దేశంలో సంస్కృతి, సాంప్రదాయం పాటించటంలేదని హిందూత్వమూకలు రెచ్చిపోతు న్నారు. అలాంటి నిబంధనలు, ఆంక్షలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మచ్చుకైనా కనిపించవు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఘోరం జరిగింది. నైట్‌క్లబ్‌లో మత్తు ,చిందుల్లో మునిగి తేలిన వారి ప్రాణాలను హరించింది. రెప్పపాటులో అగ్నికీలల్లో చేసిన ఆర్తనాదా లు కాస్తా అరణ్యరోదనలా మారాయి. అమాంతంగా 25 మందిని అగ్గి మింగేయటంతో.. వారంతా మాంసం ముద్దల్లా మారిపోయారు.ఆ నైట్‌క్లబ్‌లో కనీస భద్రతాచర్యలు లేని తేలింది. దీన్ని బట్టి చూస్తే ప్రజల ప్రాణాలంటే బీజేపీ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో స్పష్టమవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన దర్యాప్తు చర్యలు ఉపక్రమించటం కామన్ అయిపోయింది.
ఏం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా రాజధాని పానాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్పోరా గ్రామంలోని పర్యాటక కేంద్రం బగా బీచ్ సమీపంలో గల బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్‌లో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. వీరిలో నలుగురుని పర్యాటకులు, 14 మంది స్టాఫ్ మెంబర్స్‌గా గుర్తించారు. మిగతా ఏడుగురి వివరాలు తెలియాల్సి ఉన్నది. మరో ఆరుగురుకి గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతున్నది. అగ్ని ప్రమాద ఘటనకు గల కారణం ఇంకా పూర్తి స్పష్టంగా తెలియలేదు. అయితే సిలిండర్ పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మొదటి అంతస్తులో డ్యాన్స్ ఫ్లోర్ వైపు నుంచి మంటలు మొదలయ్యాయని కొంత మంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మృతుల కుటుంబీకులు ఆర్తనాదాలతో ఆస్పత్రుల్లోని మార్చురీల వద్దకు చేరుకున్నారు. వీకేండ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
చేతులు కాలాక..
ఈ ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఈ ఘటనపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నైట్‌క్లబ్ యజమానులపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని గోవా సీఎం తెలిపారు. వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందనీ, క్లబ్ మేనేజర్‌తో పాటు మరికొందరు ఇప్పటికే అరెస్ట్ అయ్యారని వివరించారు. క్లబ్‌కు సరైన ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన క్లబ్ యాజమాన్యం మాత్రమే కాకుండా.. అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మోడీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి మృతుల కుటుం బాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబా లకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. ఈ ఘటన ప్రమాదం మాత్రమే కాదనీ, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల జరిగిన ప్రభుత్వ నేరపూరిత వైఫల్యం (క్రిమినల్ ఫెయిల్యూర్) అని వివరించారు. ఈ ఘటనలో స్పష్టమైన, పారద్శక విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
గోవాలో ఘోరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



