నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
భవిష్యత్తు తరానికి ఆషాకిరణాలు విద్యార్థులు. ఎలాంటి లక్ష్యాన్ని అయినా ధైర్యంగా కృషితో సాధించవచ్చునని డిఆర్డిఏ ఈజీఎంఎం ట్రైనర్ మహేశ్ విద్యార్థులకు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం గద్వాల్ లోని గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు సమయపాలన ప్రేరణ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రేపటి విజయం మీ చేతిలోనే ఉందని, మీ జీవితం ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకాన్ని ఎలా రాయాలో మీరే నిర్ణయించుకోవాలని విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని నింపారు. వైఫల్యం అనేది జీవితంలో గమ్యం కాదు. అదే విజయానికి తొలిమెట్టుగా భావించి, వైఫల్యాలను అధిగమిస్తూ లక్ష్యం వైపు సాగాలని అన్నారు. సమయం ఎంతో విలువైనదని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కోసం సరియైన ఆహారం, నిద్ర, వ్యాయామం, ధ్యానం అనుసరించాలని,మొబైల్ ఫోన్స్, టీవీ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గొప్ప వ్యక్తుల జీవితచరిత్రలను ఉదాహరణగా చెబుతూ విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకట నరసయ్య, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కృషితో లక్ష్యాన్ని సాధించవచ్చు: డిఆర్డిఏ ఈజీఎంఎం ట్రైనర్ మహేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



