2 రోజుల నుండి పోలీసుల అదుపులో అనుమానితుడు..
నవతెలంగాణ – రామారెడ్డి
వరస మేక దొంగతనాలతో మేకల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. మండలంలోని రెడ్డి పేట గ్రామంలో గత 20 రోజుల నుండి 5 దఫాలుగా 17 మేకలు గుర్తు తెలియని దుండగులు దొంగలిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన యాపకింది నర్సింలు కు చెందిన 9 మేకలు 3 దఫాలుగా దొంగిలించారు. నగారం రాజయ్యకు చెందిన 8 మేకలను 2 దాపాలుగా దొంగిలించారు. గ్రామంలో 15 రోజుల నుండి అనుమానితుడు కారులో తిరుగుతున్నాడని గుర్తించి గత రెండు రోజుల క్రితం యాచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని , కారును పోలీసులకు బాధితులు అప్పగించి, ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమానితుడి పై కేసు నమోదైనట్ట తెలుస్తుంది. ఘటనపై పోలీసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, స్పందించలేదు.
రెడ్డి పేటలో మేకల దొంగతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



