- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నిన్న ఉదయం 10 గంటలకు 39 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రి 10 గంటల సమయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -