- Advertisement -
- – ధనలక్ష్మి ఆలయం వద్ద అన్నదానం
నవతెలంగాణ – మద్నూర్ - మద్నూర్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ధనలక్ష్మి ఆ కాలనీవాసులు నిర్మించుకున్న ధనలక్ష్మి ఆలయంలో మంగళవారం నాడు కాలనీ వాసులంతా కలిసి ఆ కాలనీ పెద్దలు సంతోష్ మేస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ధనలక్ష్మి మాత వర్షాలు సమృద్ధిగా కురిపించి కాలనీ ప్రజలకు చల్లగా ఉంచు తల్లి అంటూ మొక్కుకున్నారు ఈ కాలనీకి పక్కనే గల హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనలక్ష్మి కాలనీవాసులైన పెద్దలు, సంతోష్ మేస్త్రి, ఆయనతో పాటు నాగేష్ గౌడ్, దిగంబర్, సంతోష్, శ్రావణ్, తుకారం, విట్టల్, రాజు, ప్రకాష్ తదితరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- Advertisement -