- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే అమెరికా డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.
- Advertisement -



