Friday, December 5, 2025
E-PAPER
Homeబీజినెస్బంగారం ధర 30శాతం వరకు పెరగొచ్చు

బంగారం ధర 30శాతం వరకు పెరగొచ్చు

- Advertisement -

వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది 2026లో బంగారం ధరలు మరో 15-30 శాతం వరకు పెరగొచ్చని వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. ప్రస్తుత ధరలతో పోల్చితే ఈ స్థాయిలో ప్రియం కావొచ్చని విశ్లేషించింది. తగ్గుతున్న వడ్డీ రాబడులు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపడం తదితర అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని డబ్ల్యూజీసీ పేర్కొంది. ముఖ్యంగా గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ ద్వారా పెట్టుబడి డిమాండ్‌ మరో ప్రధాన కారణమని తెలిపింది.

పరిస్థితులు మారి ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగి, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవలసి వస్తే దీర్ఘకాలిక రాబడులు, అమెరికా డాలర్‌ బలం పుంజుకుంటాయి. అటువంటి రిస్క్‌-ఆన్‌” పరిస్థితులలో, బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 5 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయే అవకాశం కూడా ఉందని విశ్లేషించింది. భారతదేశంలో 10 గ్రాముల సుమారు రూ.1,36,000 నుండి రూ.1,37,000కు చేరే అవకాశం ఉందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -