Thursday, December 4, 2025
E-PAPER
Homeబీజినెస్పసిడి ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చు

పసిడి ధరల్లో పెరుగుదల కొనసాగొచ్చు

- Advertisement -

కొటాక్‌ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా
ముంబయి :
భవిష్యతులో బంగారం, వెండి ధరలు మరింత పెరగొచ్చని కొటాక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేష్‌ షా పేర్కొన్నారు. బుధవారం ఆయన కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వార్షిక మార్కెట్‌ ఔట్‌లుక్‌ 2026ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్‌ బ్యాంకుల నిరంతర బంగారం కొనుగోళ్ల వల్ల బంగారం, వెండి ధరల్లో కూడా పెరుగుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులు తమ రిటర్నులపై అంచనాలను కొంచెం తగ్గించుకుని, మారుతున్న మార్కెట్‌ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి సమతుల్యతతో కూడిన, విభిన్న ఆస్తులలో పెట్టుబడి చేసే వ్యూహాన్ని అనుసరించడం ఉత్తమమని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌, చిన్న క్యాప్స్‌ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చే అవకాశాలున్నాయన్నారు.

వెండి మెరుపులు
వెండి ధరలు భగ్గుమంటున్నాయి. బంగారంతో పోటీపడి పెరుగుతోన్నాయి. దేశీయంగా కిలో వెండి ధర రూ.1.84 లక్షలు పలికి సరికొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసింది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షల పైనే నమోదయ్యింది. గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. బుధవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరిగి రూ.1,30,580కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,19,700గా నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరగడానికి తోడు, రూపాయి విలువ పతనం కావడమూ ఈ లోహాల ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ 90 మార్కు దాటడంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -