Friday, October 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

- Advertisement -

కువైట్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా షార్జాకు వెళ్తుండగా..

నవతెలంగాణ-శంషాబాద్‌
కువైట్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా షార్జాకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి 1.798 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిఘా కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో కువైట్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా ఎయిర్‌ అరేబియా ఫ్లైట్‌ జీ9467 విమానంలో షార్జాకు ప్రయాణికులు వెళ్తున్నారు. అధికారులు ప్యాసింజర్‌ లగేజ్‌ని చెకింగ్‌ బ్యాగేజ్‌లో భాగంగా తనిఖీలు చేశారు.

అధికారులు సన్ఫ్లవర్‌ బ్యాగ్‌ లోపల దాచుకొని తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. అందులో 24 క్యారెట్ల బంగారం కడ్డీలు ఐదు, మరో బ్యాగేజీలో రెండు 24 క్యారెట్ల బంగారు కడ్డీలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరిశీలించి తూకం వేశారు. వాటి బరువు 1798 గ్రాములుగా లెక్కించారు. దీని విలువ రూ.2.37 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అరెస్టు చేశారు. కస్టమ్స్‌ చట్టం 1962 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -