Friday, September 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా క్యాపిటల్‌ భవనం ఎదురుగా ట్రంప్‌ బంగారు విగ్రహం

అమెరికా క్యాపిటల్‌ భవనం ఎదురుగా ట్రంప్‌ బంగారు విగ్రహం

- Advertisement -

వాషింగ్టన్‌: అమెరికా ఫెడరల్‌ రిజర్వు 25 బేసిస్‌ పాయింట్లు మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బంగారు విగ్రహాన్ని అమెరికా క్యాపిటల్‌ భవనం ఎదురుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహం.. ట్రంప్‌ బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నట్టు రూపొందించారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తు న్నాయి. డిజిటల్‌ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్‌ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే దీన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పినట్టు సమాచారం. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడి యోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతు న్నాయి. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందించగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఏడాది తర్వాత ఈ రేట్లను తగ్గించడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్‌కు ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీరేట్ల కోత ఉండవచ్చని ఫెడ్‌ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -