పెరిగిన బంగారం ధరలతో పనిలేదని మనస్థాపం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఆకాశానికి పరుగు పెడుతున్న బంగారం ఓ స్వర్ణకారుడి మెడకు ఉరి తాడైంది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతుండటం, మరోవైపు బంగారు కొనుగోళ్లులేకపోవడంతో చేసేందుకు పనిలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక స్వర్ణకారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మెదక్ పట్టణం పెద్ద బజార్ కు చెందిన స్వర్ణకారుడు నరేష్ చారి(40) గోల్డ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వృత్తి పైనే ఆధారపడి భార్య బాలామణి, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి.
దీంతో గతంలో ఉన్నట్టు వ్యాపారం సాగకపోవడంతో స్వర్ణకారులకు పని కూడా దొరకడం లేదు. కొన్ని నెలల పాటు అప్పు చేసి కుటుంబాన్ని పోషించినా పనులు మాత్రం దొరకడం లేదు. అప్పులు పెరగడంతో ఆర్థికం ఇబ్బందులుపెరిగిపోయాయి. వాటిని తీర్చేమార్గం లేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనులు లేకపోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు ఎదురై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES