Sunday, June 8, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్మనం చేసిన మంచి పని

మనం చేసిన మంచి పని

- Advertisement -

”ఈ సంవత్సరంలో మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి” అని రఘురంజన్‌ మాస్టారు విద్యార్థులను ప్రశ్నించాడు. తల్లి దండ్రులకు ఇంటిపనిలో సహాయం చేసానని రమ్య, బస్సులో ముసలి వారికి సీటు ఇచ్చానని సజన, తోటి విద్యార్థికి పుస్తకాలు కొని బహుకరించానని రాజేష్‌, ఆకలితో ఇంటికి వచ్చిన భిక్షకుడికి అన్నం పెట్టానని గోపి చెప్పారు. ఇలా తరగతిలో ఉన్న ప్రతి విద్యార్థి తాము చేసిన మంచి పనుల గురించి వివరించారు. అనూజ మాత్రం మౌనంగా ఉన్నది. ”ఆనూజా, నువు ఒక్క మంచి పనీ చేయలేదా” మాస్టారు అడిగిన ప్రశ్నకు ఆనూజ లేదని చెప్పింది. మరుసటి రోజు మార్కెట్‌లో రఘురంజన్‌కు వద్ధాశ్రమంలో పని చేస్తున్న శివ కనిపించాడు. ప్రతి నెల తన జీతంలో నుండి పది వేలు ఆశ్రమానికి రఘురంజన్‌ పంపుతుంటాడు. ”మాస్టారు, మొన్న మీ విద్యార్థిని అనూజ ఆశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని, వద్దులకు ఒక పూట భోజనం, రెండు జతల బట్టలు ఇచ్చింది” అని శివ చెప్పగానే రఘురంజన్‌ ఆశ్చర్య పోయాడు. పుట్టిన రోజున చాలా మంది పిల్లలు కేకులు కోయడము, సినిమాలు, పార్కులు, హోటల్‌కు వెళ్ళి వేడుకలు జరుపుకోవడం పరిపాటి. అనూజ ఆలోచన వినూత్నంగా అనిపించింది. ఇంత గొప్ప పని చేసి కూడా ఏమి చెప్పకుండా మౌనంగా ఉంది. తర్వాతి రోజు రఘురంజన్‌ అదే విషయాన్ని అనూజను అడిగితే, ఆమె చెప్పిన విషయం విని మరింత ఆశ్చర్యపోయాడు. ”మనం చేసిన మంచి పనిని మనమే చెప్పుకుంటే, దానికున్న గొప్పతనం తగ్గిపోతుంది సర్‌. అందుకే నేను చెప్పలేదు సర్‌” అంది అనూజ. అనూజను మెచ్చుకున్న మాస్టారు, ఒక బహుమతి ఇచ్చాడు.
– దుర్గమ్‌ భైతి, 9959007914

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -