Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంస్వదేశానికి శుభాన్షు శుక్లా

స్వదేశానికి శుభాన్షు శుక్లా

- Advertisement -

– ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
న్యూఢిల్లీ :
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) గడిపిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఆయనకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మెన్‌ వీ. నారాయణన్‌ ఘనంగా స్వాగతం పలికారు. యాక్సియం-4 మిషన్‌ విజయవంతం తర్వాత శుభాన్షు శుక్లా భారత్‌ రావడం ఇదే మొదటిసారి. ఆదివారం ప్రధాని మోడీ ని కలిసే అవకాశం ఉంది. అనంతరం యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళ్తారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న నేషనల్‌ స్పేస్‌ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్టోబర్‌లో మొదలయ్యే గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణలో పాల్గొంటారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad