- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా జీపీవోలుగా నియమితులైన 5 వేల మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. జీపీవోలకు నియామక పత్రాలను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సాయంత్రం 4 గంటలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత కార్యదర్శులు ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- Advertisement -