- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అలాగే ఏపీ రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్. రానున్న రెండు వారాల్లో స్కూళ్లకు వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీలో ఈనెల 8న స్కూళ్లకు సెలవు ఉండగా.. తెలంగాణలో ఆప్షన్ హాలిడే. 9న రెండో శనివారం, 10న ఆదివారం సెలవు కావడంతో వరుసగా మూడు రోజలు సెలవులు రానున్నాయి.
తర్వాత వారంలోనూ 15న స్వాతంత్య్ర దినోత్సవం (హాఫ్ డే స్కూల్), 16న కృష్ణ జన్మాష్టమి, 17న ఆదివారం కావడంతో వరుస సెలవులు ఉంటాయి. అయితే ఈ నెలలో వరుసగా సెలవులు వస్తున్న తరుణంలో తెలంగాణ అలాగే ఏపీ రాష్ట్రాల విద్యార్థులు సంబరపడిపోతున్నారు.
- Advertisement -