- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఆర్టీసీలో ఇప్పటికే 1000 ఆర్టీసీ డ్రైవర్లు,743 శ్రామిక్ పోస్టులకు పోలీస్ రిక్రూట్‍మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రస్తుతం ఇంటర్వ్యూ దశలో ఉందని ఈ నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. వచ్చే డిసెంబర్ ఆఖరికి 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, 114 సూపర్‍వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడు సంవత్సరాల ప్రొవిజన్ రెండు సంవత్సరాలకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
- Advertisement -



