– అధ్యయనం నిరంతర ప్రక్రియ : ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా.జి.రామేశ్వరరావు
– ఎస్కీలో శిక్షణలో పాల్గొన్న పది రాష్ట్రాల సీనియర్ రవాణ, పోలీస్ అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వివిధ కేస్ స్టడీల అధ్యయనంతో మంచి నిర్ణయాల తీసుకునే సామర్థ్యంతోపాటు సమయానికి ముందే ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అన్నారు. అధ్యయనం ఒక నిరంతర ప్రక్రియని, అభ్యాసం జీవితాంతం కొనసాగే ప్రయాణమని చెప్పారు. సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ టెక్నాలజీ, క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ డివిజన్స్ ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పంప్స్ ఆపరేషన్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ అప్లికేషన్స్, లీన్ సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ ట్రైనింగ్ కార్యక్రమాలను ఆయన సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా కాలేజీలోని కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్థులు, వివిధ డివిజన్ హెడ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ పుట్టుకొస్తున్న నూతన సాంకేతికతను అందుకోవడంతోనే ఇంజినీరింగ్ సవాళ్లను, నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చని అన్నారు. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలోని పన్నెండు డివిజన్స్ ద్వారా నాలుగు దశాబ్దాలకుపైగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ శిక్షణతో ఇంజినీర్స్, సైంటిస్ట్, టెక్నో మేనేజర్స్ సిబ్బందిలో పెరిగిన నైపుణ్యాభివృద్ధితో ఉత్పాదకత పెరిగి సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తాయన్నారు. సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ హెడ్ డాక్టర్ ఆర్.వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఐదురోజులు కొనసాగే శిక్షణ కోసం అస్సాం, ఒరిషా, మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల సీనియర్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, పోలీస్ అధికారులు హాజరయ్యారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ఆధ్వర్యంలో నిపుణులైన సీనియర్ ఫ్యాకల్టీలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాఫిక్ మేనేజెమెంట్, ఇంటర్ కనెక్టెడ్ వెహికల్స్ అండ్ ఐఓటీ ఇంటెగ్రేషన్ తదితర అనేక విషయాలపై ఫ్యాకల్టీలు ఇచ్చే శిక్షణను అభ్యర్థులు వినియోగించుకోవాలన్నారు. మహేంద్ర యూనివర్సిటీ అందించే ఇన్‌పుట్స్‌ను కూడా ఉపయోగించుకోవాలన్నారు.
మేనేజిమెంట్ టెక్నాలజీ హెడ్ డాక్టర్ యుఎస్.జ్యోతి మాట్లాడుతూ.. పంప్స్ ఆపరేషన్ ట్రైనింగ్ కోసం తమిళనాడులోని షెల్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చిన 56 మంది మెకానికల్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్స్, అసోసియేటెడ్ ఇంజినీర్స్ కోసం పంప్స్ స్టాండర్డ్స్ మెకానికల్ సీల్స్, అడ్వాన్సుడ్ పంప్ టక్నాలజీస్ తదితర విషయాలపై సీనియర్ ఫ్యాకల్టీలు తెలియజేస్తారన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన షెల్ ఇండియా టీమ్ లీడ్ లక్ష్మి నారాయణను డైరెక్టర్ శాలువాతో సత్కరించారు. క్వాలిటీ ప్రొడెక్టివిటీ హెడ్ రామ కిషోర్ మాట్లాడుతూ.. లీన్ సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ శిక్షణ కోసం ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కమిషన్‌తోపాటు వివిధ నౌకా నిర్మాణ సంస్థల నుంచి విచ్చేసిన అభ్యర్థులకు గ్రాఫికల్ ఎనాలిసిస్, డెమైక్ మెథడాలజీ తదితర విషయాలపై శిక్షణ ఉంటుందన్నారు. డాక్టర్ భరత్ కార్యక్రమ నిర్వహణ చేశారు. సమావేశంలో ఎస్కీ చీఫ్, డిప్యూటీ చీఫ్ లక్ష్మి కాంతరావు, డాక్టర్ పి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
కేస్ స్టడీల అధ్యయనంతో మంచి ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



