- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్ : గత నాలుగు రోజుల క్రితం పోచారం ప్రాజెక్టు భారీ వరదకు ప్రాజెక్టు దిగువన ఉన్న గోపాల్పేట్ నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. శనివారం రోజు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోతకు గురైన రోడ్డును పరిశీలించి సంబంధిత శాఖకు వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం రోజు ఆర్ అండ్ బి అధికారులు రహాదారి పనులను ప్రారంభించారు. రెండు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి.
- Advertisement -