Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుగోపీనాథ్‌ మరణం పార్టీకి తీరని లోటు : కేసీఆర్‌

గోపీనాథ్‌ మరణం పార్టీకి తీరని లోటు : కేసీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌: పార్టీ సీనియర్‌ నేత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్‌ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
తనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad