గర్జనపల్లి యువత వినూత్న వితరణ
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో కోతుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్, యూట్యూబ్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఒక ఉపాయం ఆలోచించారు. దాదాపు రూ. 3 వేల ఖర్చు చేసి ఆన్‌లైన్ ద్వారా ఒక గొరిల్లా డ్రెస్ సూట్‌ను కొనుగోలు చేశారు. ఈ సూట్‌ను గ్రామ సర్పంచ్ రాకేశ్ గౌడ్ వితరణగా అందజేశారు.సర్పంచ్ రాకేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ చేసిన ఈ వితరణను అభినందించారు. ఈ డ్రెస్ కోడ్‌ను ప్రతిరోజూ గ్రామ పంచాయతీ సిబ్బందికి ధరింపజేసి వీధుల వెంబడి తిప్పుతామని తెలిపారు. దీనివల్ల కోతులు భయపడి పారిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గజ్జెల శ్రీనివాస్, ఇసంపల్లి అజయ్ కుమార్, కార్యదర్శి వెంకటేష్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కోతుల బెడదకు గొరిల్లా చెక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



