- Advertisement -
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా)గా బాధ్యతలు స్వీకరించిన ఎన్వీఎస్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. నగర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి తగు సలహాలు ఇవ్వాల్సిందిగా ఎన్వీఎస్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు.
- Advertisement -