Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోల్డ్ జిమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

గోల్డ్ జిమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డ్ జిమ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్  షబ్బీర్ అలీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ  మాట్లాడుతూ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ఇటువంటి జిమ్‌లు ఏర్పాటు కావడం యువతకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ యువతకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని  తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మండలాధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -