నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల నియమించిన మూడు దేవాలయాల జెండా బాలాజీ ఆలయ కమిటీ, శంభుని గుడి ఆలయ కమిటీ,శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ సోమవారం హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోనీ పలు దేవాలయ కమిటీ నూతన చైర్మన్ పాలకవర్గ సభ్యులతో షబ్బీర్అలీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ జెండా బాలాజీ ఆలయ కమిటీ చైర్మన్ గా లవంగ ప్రమోద్ కుమార్, డైరెక్టర్లుగా పాలకొండ నర్సింగరావు, సిరిపురం కిరణ్ కుమార్, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, పవర్ విజయ, కోరవ రాజ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
అదేవిధంగా శంభుని గుడి ఆలయ కమిటీ చైర్మన్ గా, బింగి మధు, డైరెక్టర్లుగా,గాజుల కిషోర్,గాండ్ల సంతోష్ కుమార్, కమల్ కిషోర్ దయ్మా ,మామిడి శేఖర్ ,ఉప్పల రమేష్,గోపు రేఖ లను ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గా బొత్కం గంగా కిషన్, డైరెక్టర్లుగా శ్రీ రాం రమేష్ ,గాదె ప్రవీణ్ కుమార్, బాణాల శివ లింగం, కోల్తే శాంతా బాయ్ లతో ఆయా దేవాలయాల ఆవరణంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ. జెండా బాలాజీ,శంభుని గుడి, శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయాలు చాలా పురాతన మైనవి మరియు మహిమలు గలవని అన్నారు.
నాకు ఆలయల అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన అమ్మవారూ స్వామివార్లు , ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని , ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనల మోహన్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES