Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

యుటిఎఫ్ క్యాలెండర్ డైరీ ల ఆవిష్కరణ 

 యుటిఎఫ్  జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ

నవతెలంగాణ నెల్లికుదురు

ప్రభుత్వ విద్యారంగా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం క్యాలెండర్ మరియు డైరీలను ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి  యు టి ఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని,  అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘ ఉపాధ్యాయులు   అంకితభావంతో   నిర్విరామంగా కృషి చేసి ఉన్నత  ఫలితాలను  సాధించారని అన్నారు.సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని, సీపీఎస్  విధానం ను వెంటనే రద్దు చేయాలని ,పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి స్వప్న గారు మాట్లాడుతూ కేజీబీవీ , మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారించాలని ,హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని  ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ,ప్రధానకార్యదర్శులు జి. రంజిత్ కుమార్, కోట జనార్ధన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలగం శ్రీనివాస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపేందర్ నాయకులు నరేందర్, భాస్కర్, రవీందర్, యూగేందర్,రవి,రాకేష్,దుర్గయ్య,విజయకుమార్, రామ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -