Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ 
– ఆయిల్ ఫామ్ పంట పైన అవగహన సదస్సు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు పలు రకాల సబ్సిడీలను అందిస్తుందని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని చౌట్ పల్లి రైతు వేదిక భవనంలో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, ఉద్యాన శాఖ అధికారి రాజు రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు పొందవచ్చన్నారు. కోతులు ముట్టని, పందుల బెడద దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ ఆయిల్ ఫామ్ అని తెలిపారు. ఎన్ఎంఈఓ- ఓపి పథకం కింద ఈ కింది సబ్సిడీలు ఉన్నాయన్నారు.మొక్కలకు 90 శాతం రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.

ఆయిల్ ఫామ్ మధ్యలో అంతర పంటగా మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా తదితర పంటలు సాగు చేసినందుకు ఎకరానికి రూ.4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ,5 ఎకరాలకు పైగా సాగు చేసేవారికి 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. అవగాహన సదస్సులో వ్యవసాయ విస్తీర్ణ అధికారి పద్మ,  క్లస్టర్ ఆఫీసర్ జి. నాగేష్ గౌడ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad