Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట 

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట 

- Advertisement -

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ చైర్పర్సన్ గౌని ప్రమోదిని 
నవతెలంగాణ – పెబ్బేరు 

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెబ్బేరు మార్కెట్ చైర్ పర్సన్ గౌని ప్రమోదని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి ఆదేశానుసారం తో పెబ్బేరు మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో అధ్యక్షులు గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఏ విజయవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించిందని, ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుంది అన్నారు. శుక్రవారం పెబ్బేరు మార్కెట్ యార్డ్ నందు, రంగాపూర్, చెలిమిళ్ళ పిఎసిఎస్, మెప్మ ఆధ్వర్యంలో  వరి ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు.  రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలుకేంద్రాలలో ధాన్యం విక్రయించాలన్నారు. ఇ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -