నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ మంత్రులు నివాస సముదాయాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్ధులకు ఇవ్వావలసిన ఫిజులను ప్రభుత్వం విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 15లక్షల మంది పేద దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులకు వెళ్ళకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం హయంలో 6300 కోట్ల రూపాయలు,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4100 కోట్లు మొత్తం 10,500 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న వారి గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వ యూనివర్శీటీలు, ప్రభుత్వ కళాశాలలు,హస్టల్స్ బకాయిలు ఉన్నాయని వాటితోపాటు ప్రైవేటు విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్ధులకు కూడా ఫీజులు ప్రభుత్వం చెల్లించక పోవడంతో విద్యార్థుల సర్టీఫికెట్స్ నిలుపుదల చేస్తున్నారని అన్నారు.
విద్యార్థులు ఫీజులు గురించి కనీసం మాట్లడకుండా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యా శాఖకు కనీసం మంత్రిని కూడా కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖను పెట్టుకోని ముఖ్యమంత్రి స్కాలర్ షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు,మంత్రులకు, ఎంపిలకు,ఎమ్మెల్యేలు ఒక్కనెల కూడా జీతాలు పెండింగ్ లో ఉండవు కానీ విద్యార్ధులకు ఎందుకు జీతాలు పెండింగ్ లో ఉంచుతున్నారని అన్నారు.? విద్యార్థులు ఫీజులను విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులను అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు.
మంత్రులు నివాస సముదాయాలు ముందు ధర్నా చేస్తున్న విద్యార్ధి నాయకులను పోలీసులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ,విద్యార్థులు మద్య తీవ్ర తొపులాట జరిగింది. మంత్రులు నివాస సముదాయంలోకి చోచ్చుకోని వెళ్తున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లుకు తరలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు డి. కిరణ్,బాధ్యత. శంకర్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కార్తీక్,అవినాష్,లెనిన్ గువేరా,జూనుగరి రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకత్వం నాగేందర్,రజనీకాంత్, ప్రవీణ్,ఆంజనేయులు, కైలాస్,చరణ్ తేజ, రంగారెడ్డి జిల్లా నాయకత్వం చరణ్,లిఖిత్ ,చందు,ఇర్పాన్, రేష్వంత్, ఇర్పాన్, కిషోర్, మేడ్చల్ జిల్లా నాయకత్వం కౌశిక్, సాత్విక్,అజయ్, సాయి చరణ్, శ్రీ ప్రణిత్, పవన్, తదితరులు పాల్గొన్నారు.



