Monday, November 17, 2025
E-PAPER
Homeఖమ్మంఅశ్వరావుపేటలో 250 పేదల నివాసాలను నేలమట్టం చేసిన ప్రభుత్వ యంత్రాంగం

అశ్వరావుపేటలో 250 పేదల నివాసాలను నేలమట్టం చేసిన ప్రభుత్వ యంత్రాంగం

- Advertisement -

– తొలగించ్చొద్దంటూ కాళ్ళపై పడి ప్రాధేయపడినా కనికరించని అధికారులు
– సిపిఐ నాయకుల ముందస్తు నిర్బంధం
– పేదలకు ఇళ్ళు నిర్మించే వరకు పోరాటం 
– సీపీఐ జిల్లా కార్యదర్శి షా బీర్ పాషా
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండు చోట్ల ప్రభుత్వ భూమిలోని 250 పేదల నివాసాలను సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెవెన్యూ,పోలీస్,ఫైర్,విద్యుత్ శాఖల యంత్రాంగం మూకుమ్మడిగా ఐదు జేసీ బీ లతో నేలమట్టం చేసారు. దీంతో బాధితులు ఆందోళన, ఆర్తనాధాలతో అధికారుల ను ప్రాధేయపడి కాళ్ళ మీద పడినప్పటికీ కనీసం కనికరం కూడా చూపించకుండా అధికార యంత్రాంగం నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయం లోనే స్థానిక సీపీఐ నాయకులు సలీం మరికొందరిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని దమ్మపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించి,తెల్లవారుజామున నాలుగు గంటల సమయం లో పాల్వంచ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీ తో సహా సుమారు 200 మంది పోలీసులు ఈ నివాసాల తొలగింపులో పాల్గొన్నారు.

ఈ సమయంలో చంటి పిల్లల, వృద్ధులు,వికలాంగుల ఆర్తనాధాలతో ఆ ప్రాంతం మారు మోగిపోయింది. సర్వే నెంబర్ 1228 లో కెమీలాయిడ్స్ గెస్ట్ హౌస్ సమీపంలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో,అల్లి గూడెం మార్గంలోని ఎఫ్సీఐ గోడౌన్ లు దగ్గర మరో రెండు ఎకరాల భూమిలో సుమారు 250 మందికి పైగా కుటుంబాలు గత ఐదు సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తునారు. గత కొన్ని రోజులు క్రితం ఈ భూమి ప్రభుత్వ భూమి అని,దీన్ని యంగ్ ఇండియా స్కూల్ ప్రభుత్వం కేటాయించిందని,అనధికారికంగా వేసిన గుడిసెలు తొలగించాలని తహశీల్దార్ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి హెచ్చరించారు.

ఈ క్రమంలో పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి సమయంలో సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకొని దమ్మపేట పోలీస్ స్టేషన్ లో నిర్భందించి యంత్రాలను తీసుకువచ్చి నిద్ర మత్తులో ఉన్న మా ఇళ్ల పై దాడి చేసి జేసీ బీ లతో నివాసాలు నేలమట్టం చేసారని పేదలు వాపోతున్నారు. ఈ చర్యతో 250 కుటుంబాలకు పైగా పేదలు రోడ్డు పాలయ్యారు.

పేదలకు ఇళ్ళు నిర్మించే వరకు పోరాటం – సీపీఐ జిల్లా కార్యదర్శి షా బీర్ పాషా
వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పరిశ్రమలు,వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్న ధనవంతులు ను వదిలేసి పేదలు గుడిసెలను కూల్చడం అన్యాయమని,ప్రజాస్వామ్యం రాజరికం మాదిరి వ్యవహరించడం సహించమని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా హెచ్చరించారు. పేదలు నివాసాలు నేలమట్టం చేసిన విషయం తెలుసుకున్న ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. వారికి మద్దతుగా ప్రెస్ మీట్ లో విలేఖర్లతో మాట్లాడారు. యంగ్ ఇండియా స్కూల్ కు ప్రత్యామ్నాయం స్థలం ఉన్నా పేదలు ఇళ్ళు కూల్చడం ఏమిటి అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళు నిర్మించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆయన వెంట సలీం, రామక్రిష్ణ మరికొందరు నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -