Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజీవో నెం.51 సవరించాలి

జీవో నెం.51 సవరించాలి

- Advertisement -

– మల్టీపర్పస్‌ పని విధానాన్ని రద్దు చేయాలి
– రాష్ట్ర వ్యాప్తంగా జీపీ కార్మికుల ధర్నాలు

నవతెలంగాణ- విలేకరులు
జీఓ నెంబర్‌ 51ని సవరించా లని, మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించా లని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ధర్నాలు, నిరసన కార్యక్ర మాలు చేపట్టారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐ టీయూ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వచ్చి నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓకు వినతిపత్రాన్ని అందజేశారు.
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెలా 5వ తేదీ లోపు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డీపీఓ సాయిబాబాకు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ ఏవో అబ్దుల్‌ రెహమాన్‌కు వినతిపత్రం అందజేశారు. మెదక్‌ జిల్లాలోని కాంట్రాక్టు కార్మికులు, పార్ట్‌ టైం ఉద్యోగులు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్‌, మున్సిపల్‌ కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో మర్రికుంట పాల కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు మహాధర్నా అనంతరం డీపీఓ శ్రీరామ్‌కు వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad