Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలుఅర్హులకు అందని ప్రభుత్వ పథకాలు: సీపీఐ(ఎం)

అర్హులకు అందని ప్రభుత్వ పథకాలు: సీపీఐ(ఎం)

- Advertisement -

 – గడ్డం వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందలేదని రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కుటుంబ సర్వే సందర్భంగా గ్రామంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక మంది పేద ప్రజలు అర్హులైన వారు ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు, అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ పథకాలు అర్హులకు అమలు చేయడంలో స్థానిక అధికార పార్టీ నాయకత్వం తేడాలు చూపించారని అన్నారు.

పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు అందించాలి కానీ గౌరాయపల్లి గ్రామంలో అందించడం లేదని వారు అన్నారు. వెంటనే స్థానిక అధికారులు దీనిపై విచారణ జరిపి అర్హులైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అకాల వర్షాల కారణంగా మండల వ్యాప్తంగా అనేకమంది రైతులు పంట నష్టపోవడం జరిగింది అన్నారు. వందల ఎకరాల పంట నేలకోరిగింది అయినా మండలాధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా పంటల పరిశీలన చేసి నష్టపరిహారాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇప్పించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బబ్బురీ శ్రీను, ఇంజ లింగం, బిక్షపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -