- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామనికి చెందిన బి అర్ ఎస్ పార్టీ మండల నాయకులు ప్యాక్స్ డైరెక్టర్ గజ్జెల ఆనందం కుటుంబాన్ని ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి ప్రజా సంఘాల నాయకులు అరుణ్ కుమార్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాకేష్, బీఎస్పీ నియోజక వర్గం ఇంచార్జి కొమురయ్య నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆనందం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నలిమేటి నాగ రాజు,గజ్జెల అశోక్, రంజిత్, నాంపల్లి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -