తండ్రి మృతి చెందడంతో దుఃఖాన్ని దిగమింగుతూ టెన్త్ పరీక్షకు హాజరైన కొడుకు
టీచర్ ఎల్లయ్య, మృతితో గాంధీనగర్ కాలనీలో విషాయాలు అలుముకున్నాయి
నవతెలంగాణ – మోత్కూర్
మోత్కూరు మున్సిపాలిటీ గాంధీనగర్ కాలనీకి చెందిన కూరేళ్ల ఎల్లయ్య (50) ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా, పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షుడిగా గుండాల మండలం వస్తా కొండూరు ఎంపీపీ పాఠశాలలో పని చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద గుండెనొప్పి రావడంతో నల్గొండలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సాయంత్రం వరకు ఆరోగ్యం కొంత కుదుట పడగా ఇంటికి వచ్చాడు. శనివారం తన కొడుకు హర్షవర్ధన్ కు టెన్త్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ హాస్పటల్ కు వెళ్లి మరోసారి చికిత్స చేయించుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు.
ఇంతలోనే రాత్రి మళ్లీ హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భువనగిరి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కాలనీలో టీచర్ ఎల్లయ్య మృతి చెందాడని తెలియడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో తండ్రి మృతి చెందడంతో దుఃఖాన్ని దిగమింగుతూ.. కొడుకు హర్షవర్ధన్, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. మృతుడికి భార్య, ఒక్క కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎల్లయ్య మృతదేహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, ఉపాధ్యాయులు, పిఆర్టియు సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.




