నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, జన్నారం స్కూల్ కాంప్లెక్స్ టీచర్స్ మీటింగ్ పిఓ,ఐటీడీఏ, ఉట్నూర్ ఆదేశాల మేరకు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జిల్లా అధికారులు నూతనంగా నియమింపబడిన ఎస్ సి ఎం ఓ లక్ష్మయ్య, మంచిర్యాల సమక్షంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శివరాజం మాట్లాడుతూ టి డబ్ల్యూ పిఎస్ ఉపాధ్యాయులందరూ పాఠశాల ఉపాధ్యాయులందరూ అంకితభావంతో పనిచేయాలని, సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏసీఎంవో మాట్లాడుతూ విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, వారికి సరైన విద్యను అందించాలని, టి డబ్ల్యూ పిఎస్ ఉపాధ్యాయుల అటెండెన్స్ రోజులో మూడుసార్లు జిపిఎస్ ఫొటోస్ ద్వారా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.
నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందజేయాలని పై అధికారుల ఆదేశాలను తూ. చ తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీఆర్పి శ్రీ రఘునాథం, సి ఆర్ పి బుచ్చన్న, జన్నారం దండపెల్లి మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.